News

లోకేష్ నాయకులను గౌరవించే వ్యక్తి


మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పపై దుష్ప్రచారం జరుగుతోందని నాయకులను గౌరవించే వ్యక్తి లోకేష్ అని అన్నారు. లోకేష్ ఎవరి పట్ల దురుసుగా మాట్లాడలేదని ఆయన చెప్పారు. డిసెంబర్ లేదా జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. గత ఏడాది కన్నా దిగుబడి పెరగడం వల్లే ఉల్లి ధర తగ్గిందని, క్వింటా ఉల్లికి రూ.200 సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఉల్లి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రత్తిపాటి భరోసా ఇచ్చారు.